రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ నరకయాతన - auto driver suffered seriously while met with an accident in jagityal
close
Published : 28/03/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ నరకయాతన

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్‌ నరకయాతన అనుభవించాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వద్ద ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌ ఆటోలోనే ఇరుక్కుపోయాడు. అరగంటపాటు నరకయాతన అనుభవించాడు. ఆటో ముందుభాగం నుజ్జునుజ్జవగా డ్రైవర్‌ బయటకు రాలేకపోయాడు. స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు క్రేన్‌ సాయంతో ఆటో డ్రైవర్‌ను రక్షించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని