భర్తకు కరోనా .. భార్యను గెంటేశారు! - bad incident in rajamahendravaram
close
Published : 23/07/2020 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భర్తకు కరోనా .. భార్యను గెంటేశారు!

రాజమహేంద్రవరంలో అమానుష ఘటన

రాజమహేంద్రవరం నగరం : అద్దె ఇళ్లలో ఉంటూ కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కరోనాపై ప్రభుత్వ, ప్రసార మాధ్యమాలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరిలో ఇంకా భయాందోళనలు, అపోహలు తొలగిపోవడంలేదు. తోటి వారిపట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన వారు.. చాలా  కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.

రాజమహేంద్రవరం ఆల్కట్‌ గార్డెన్స్‌ ప్రాంతంలోని యాళ్లవారి వీధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కడియం మండలం బుర్రిలంకలో ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది.  ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆమె భర్తకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ  అయింది. హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించగా, అతను ఇంట్లో ఉండేందుకు స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో అతన్ని బొమ్మూరులోని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రానికి పంపించారు. 

ఈక్రమంలో బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. అద్దె ఇంట్లోకి రావొద్దని యజమాని అభ్యంతరం తెలిపాడు. అదే కాలనీలో నిర్మాణంలో ఉన్న సొంతింటికి వెళ్లగా అక్కడ కూడా స్థానికులు అడ్డుకుని గేటుకు తాళం వేశారు. రాత్రి నుంచి రోడ్డుపైనే వర్షంలో తడుస్తూ  కూర్చున్నానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సొంతింటిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వీధిలోని వారు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, అధికారులు స్పందించి ఆదుకోవాలని మహిళ విజ్ఞప్తి చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని