బాలకృష్ణ - బోయపాటిల చిత్రం పేరు ఖరారు! - balakrishna - boyapati movie name finalized!
close
Updated : 19/02/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలకృష్ణ - బోయపాటిల చిత్రం పేరు ఖరారు!

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం వీరి కాంబినేషన్లలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. ‘బీబీ3’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే పలు రకాల టైటిల్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ‘గాడ్ ఫాదర్’ అనే పేరును చిత్రబృందం ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆ మధ్య బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘బీబీ3’ ఫస్ట్ రోర్ పేరట ఓ వీడియో విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. అందులో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.  ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్ దీనికి సంగీత స్వరాలు సమకూరస్తున్నారు. సినిమా ఈ ఏడాది మే 28న విడుదల కానుంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని