అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన బాలయ్య - balakrishna new movie title roar
close
Updated : 13/04/2021 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన బాలయ్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైనా టైటిల్‌ని ప్రకటించకుండా ఆసక్తిని పెంచింది చిత్ర బృందం. ఉగాది పండగని పురస్కరించుకుని ఆ ఉత్కంఠకు తెరదించుతూ అభిమానులకు సర్‌ప్రైజ్‌ అందించింది. ఈ చిత్రానికి ‘అఖండ’ అనే పేరు ఖరారు చేస్తూ ఓ వీడియోను పంచుకుంది. ఇందులో ‘కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌ అదరగొడుతోంది.

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది. మరో నాయిక పూర్ణ వైద్యురాలి పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సింహా’ , ‘లెజెండ్‌’ తర్వాత బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని