కొవిడ్‌ ఆంక్షలకు నిరసనగా మద్యం విక్రయాలు బంద్‌! - ban on liquor sale in thane until demands met
close
Published : 04/04/2021 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ ఆంక్షలకు నిరసనగా మద్యం విక్రయాలు బంద్‌!

ఠానేలో హోటళ్ల యజమానుల ప్రకటన

ముంబయి: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 15 వరకు రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఠానే జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్‌ యజమానుల సంఘం నిరసన తెలియజేసింది. లాక్‌డౌన్‌తో ఇప్పటికే తాము తీవ్రంగా నష్టపోయామని, తాజాగా విధించిన రాత్రి కర్ఫ్యూతో తమ వ్యాపారాలు మరింత దెబ్బతింటున్నాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దీనికి నిరసనగా తమ డిమాండ్లు నెరవేరే దాకా జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్సైజ్‌ ఫీజును వాయిదాల వారీగా చెల్లించేందుకు అనుమతించడంతో పాటు రాత్రి 8 గంటల నుంచి విధించిన కర్ఫ్యూను ఎత్తివేయాలని కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేదాక ఠానేతో పాటు డొంబ్లివి, కల్యాణ్‌, నవీ ముంబయి తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలను నిలిపివేస్తామని హెచ్చరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని