Bandla ganesh: ఆ జర్నలిస్ట్‌ వల్లే మనసు మార్చుకున్నా! - bandla ganesh twitter reentry
close
Published : 19/08/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bandla ganesh: ఆ జర్నలిస్ట్‌ వల్లే మనసు మార్చుకున్నా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేవలం హాస్యనటుడిగానే కాకుండా నిర్మాతగానూ బండ్లగణేష్‌ సుపరిచితుడే. హీరో పవన్‌ కల్యాణ్‌కు ‘గబ్బర్‌సింగ్‌’తో భారీ విజయాన్ని అందించిన ఆయన.. ఆయన ఇంటర్య్యూలో ఇచ్చే పంచ్‌ డైలాగ్స్‌తో మరింత ఆదరణ సంపాదించారు. 7 క్లాక్‌ బ్లేడ్‌ అంటూ ఆయన అభిమానులు సరదాగా  ఆటపట్టిస్తుంటారు కూడా. జనాల్లో మంచి క్రేజ్‌ ఉన్న బండ్లగణేష్‌ అభిమానులను ట్విటర్‌ వేదికగా పలకరిస్తూ యాక్టివ్‌గా ఉంటారు. కాగా ఇటీవల ట్విటర్‌కు గుడ్‌బై చెబుతున్నా అంటూ ప్రకటించారు. తాజాగా ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు మళ్లీ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ‘‘పెద్దలు జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు ఈరోజు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని నాకు సలహా ఇచ్చారు. వారి సలహాను గౌరవంగా భావించి మీ అందరి ముందుకి మళ్ళీ వస్తున్నాను’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆంజనేయులు, తీన్మార్‌, గబ్బర్‌సింగ్, టెంపర్‌, ఇద్దరమ్మాయిలతో వంటి హిట్‌ చిత్రాల నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు బండ్ల గణేష్.  గతేడాది విడుదలైన మహేశ్‌బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ పాత్రలో మెప్పించిన గణేష్‌ మళ్లీ నిర్మాతగా బిజీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని