close
Published : 05/03/2021 13:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!

ఆకట్టుకునేలా ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ టీజర్‌

హైదరాబాద్‌: నూతన నటీనటులు ఆల్తాఫ్‌ హాసన్‌, శాంతిరావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సతీష్‌కుమార్‌, రామకృష్ణ వీరపనేని నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ‘జీవిత చరిత్రలు పెద్దపెద్ద నాయకులు, సినీ ప్రముఖులకే కాదండి.. మీలాంటి, నాలాంటి మామూలు మనుషులకు కూడా ఉంటాయి.’ అనే డైలాగ్‌తో ఆరంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. ‘తీసేవాడు ఉండాలే కానీ ప్రతివాడి బతుకు ఒక బయోపిక్కే’, ‘ప్రతి కథలోనూ ట్విస్టులు ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ వీడి విషయానికి వచ్చే సరికి ట్విస్టుల్లోనే కథ ఉంటుంది’ అనే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని