#BB3 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..! - bb3 latest update
close
Updated : 31/01/2021 22:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#BB3 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..!

హైదరాబాద్‌: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే.. గతేడాది బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘BB3 ఫస్ట్‌ రోర్‌’ మినహా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ చిత్రబృందం నుంచి రాకపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ఇదిలా ఉండగా.. గత కొన్నిరోజుల నుంచి అగ్రకథానాయకులు తమ సినిమా రిలీజ్‌ డేట్స్‌తో అలరిస్తున్నారు. ఈ తరుణంలో బాలయ్య-బోయపాటి టీమ్‌ ఆసక్తికరమైన వార్తను అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

ఇకపోతే.. బాలయ్యను మాస్‌ పాత్రలో చూపించాలంటే బోయపాటిని మించిన దర్శకులు లేరనేది అభిమానుల అభిప్రాయం. ఈ ఇద్దరూ కలిస్తే బాక్సాఫీస్‌ షేక్‌ కావాల్సిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతలా ఉర్రూతలూగించాయో మనందరికీ తెలుసు. ఈ హిట్‌ కాంబినేషన్‌లో మూడో చిత్రం కూడా వస్తుండటంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బీబీ3’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ అలరిస్తోంది.

ఇదీ చదవండి

వకీల్‌సాబ్‌ వచ్చేస్తున్నాడు..!




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని