Srilanka tour: శ్రీలంక పర్యటనకు భారత జట్టు ప్రకటన - bcci announced team india squad for odi and t20 series against srilanka
close
Updated : 10/06/2021 23:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Srilanka tour: శ్రీలంక పర్యటనకు భారత జట్టు ప్రకటన

దిల్లీ: శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.  సీనియర్‌ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ టూర్‌లో ఉన్న నేపథ్యంలో వన్డే, టీ20కి శిఖర్‌ ధావన్‌కి కెప్టెన్‌ పగ్గాలు అప్పగించింది. భువనేశ్వర్‌ కుమార్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 20 మంది ఆటగాళ్లతో పాటు 5 నెట్‌ బౌలర్లను ఎంపిక చేశారు. యువకులతో కూడిన జట్టు త్వరలోనే శ్రీలంకకు పయనమవనుంది. జులైలో శ్రీలంకతో భారత్‌ తలపడనుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు శ్రీలంకతో 3 వన్డే మ్యాచ్‌లు, 3 టీ20లు ఆడనుంది.  జులై 13న తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది. అన్ని మ్యాచ్‌లు ప్రేమదాస క్రికెట్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నారు.  

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌(వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీష్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, నితిష్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్‌(వికెట్‌ కీపర్‌),యజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చాహర్‌, కె.గౌతమ్‌, కృనాల్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌, వరణ్‌ చక్రవర్తి, దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా

నెట్‌ బౌలర్స్‌: ఇషాన్‌ పోరెల్‌, సందీప్‌ వారియర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, సాయి కిషోర్‌, సిమర్‌జీత్‌ సింగ్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని