దిగులు చెందొద్దు.. అన్ని ఏర్పాట్లు చేస్తాం..  - bcci assures foreign players not to worry about safe return after ipl 2021
close
Updated : 29/04/2021 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిగులు చెందొద్దు.. అన్ని ఏర్పాట్లు చేస్తాం.. 

విదేశీ ఆటగాళ్లకు బీసీసీఐ అభయహస్తం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్ 14వ సీజన్‌ పూర్తయ్యాక విదేశీ ఆటగాళ్లు క్షేమంగా స్వస్థలాలకు వెళ్లేంత వరకూ తమ పని పూర్తికాదని, అందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తామని బీసీసీఐ సీఓఓ హేమంగ్‌ అమిన్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు సోమవారం టోర్నీని వీడి స్వదేశానికి తిరిగి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విదేశీయులు సైతం టోర్నీ పూర్తయ్యాక తమ ఇళ్లకు ఎలా వెళ్లాలనే విషయంపై ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భారత్‌ నుంచి వెళ్లే ప్రయాణికుల విమానాలను ఆస్ట్రేలియా మే 15 వరకు నిషేధం విధించింది. దాంతో రాబోయే రోజుల్లో పరిస్థితి విషమిస్తే అంతర్జాతీయ ప్రయాణాలపై మరింత ప్రభావం ఉండొచ్చనే సందేహం మొదలైంది.

ఈ నేపథ్యంలోనే విదేశీ ఆటగాళ్లు తిరిగి స్వదేశాలకు వెళ్లే విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హేమంగ్‌ స్పష్టం చేశారు. అందుకోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ‘మీలో చాలా మంది ఈ టోర్నీ పూర్తయ్యాక తిరిగి స్వదేశాలకు ఎలా వెళ్లాలనే విషయంపై భయపడుతున్నారని మాకు అర్థమైంది. అయితే, అందులో మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు క్షేమంగా ఇళ్లకు చేరేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు బీసీసీఐ చేపడుతుంది. ప్రస్తుత పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. టోర్నీ ముగిశాక మీరు భద్రంగా ఇంటికి చేరేలా తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నాం. అప్పటివరకు మా పని పూర్తికాదు’ అని హేమంగ్‌ ఆటగాళ్లకు రాసిన లేఖలో ప్రస్తావించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని