కరోనా ఉద్ధృతి: టోర్నీలు రద్దు చేసిన బీసీసీఐ - bcci suspends all age group cricket tournaments
close
Published : 17/03/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఉద్ధృతి: టోర్నీలు రద్దు చేసిన బీసీసీఐ

ముంబయి: భారత్‌లో కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని వయో విభాగాల క్రికెట్‌ టోర్నమెంట్‌లను రద్దు చేసింది. త్వరలో జరగనున్న వినూ మన్కడ్‌ ట్రోపీతో సహా అన్ని టోర్నమెంట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా అన్ని రాష్ట్రాల క్రికెట్‌ బోర్డులకు సమాచారం అందించారు. 
అహ్మదాబాద్‌లోని మొతేరా వేదికగా భారత్‌- ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌ జరుగుతున్న తెలిసిందే. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మంగళవారం జరిగిన  మూడో టీ20 ప్రేక్షకులు లేకుండానే జరిగింది. మిగతా మ్యాచ్‌లను కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నట్లు గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఇప్పటికే తెలిపింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని