ఇక్కడ పోయింది...అక్కడ దక్కింది - behind the reason why shraddha kapoor quits from saina biopic
close
Published : 22/03/2021 18:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇక్కడ పోయింది...అక్కడ దక్కింది

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశం గర్వించదగ్గ బ్యాడ్మింటన్‌ క్రీడా కారిణి సైనా నెహ్వాల్‌ జీవిత కథతో ‘సైనా’ తెరకెక్కుతోంది. టైటిల్‌ పాత్రను పరిణీతి చోప్రా పోషిస్తోంది. కానీ ఈ సినిమాని ముందు శ్రద్ధాకపూర్‌ ప్రధాన పాత్రలో తీయాలనుకున్న సంగతి తెలిసిందే. ‘సైనా’లోని పాత్ర కోసం శ్రద్ధా కపూర్‌ కొంచెం హోంవర్క్‌ కూడా చేసింది. కానీ చివర్లో తప్పుకుంది. ఇంతకీ శ్రద్ధ ఈ చిత్రాన్ని ఎందుకు వదులుకుందో కారణం చెప్పారు చిత్ర దర్శకుడు అమోల్‌ గుప్తా.

‘‘సైనా’ బయోపిక్‌ కోసం ముందు శ్రద్ధాకపూర్‌నే తీసుకున్నాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాం. పాత్ర కోసం కొన్ని వారాల పాటు ప్రత్యేక సాధన కూడా చేసింది శ్రద్ధ. అనుకోకుండా ఆమె అనారోగ్యానికి గురైంది. అలాంటి పరిస్థితుల్లో రోజుకు పన్నెండు గంటలు బ్యాడ్మింటన్‌ కోర్టులో నిలబడి ఉండటం కష్టం కావడంతో ఆమె ‘సైనా’ నుంచి తప్పుకుంది. అదే సమయంలో మా నిర్మాత భూషణ్‌కుమార్‌ తీస్తున్న ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ త్రీడీ’ చిత్రానికి నాయికగా కోసం చూస్తున్నారు. శ్రద్ధకు ఆ కథ నచ్చడంతో ఆమెను ఆ చిత్రానికి తీసుకున్నారు నిర్మాత. దీంతో ఇక్కడ కోల్పోయింది ఆమెకు అక్కడ దక్కింది. అదే సమయంలో ‘చిఛ్చోరే’ లాంటి మంచి కథ కూడా తన వద్దకు రావడం శ్రద్ధకు కలిసొచ్చింది’’ అని చెప్పారు అమోల్‌. ‘సైనా’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని