‘బెల్‌బాటమ్‌’ వాయిదా పడుతుందా? - bell bottom will release in august
close
Published : 12/07/2021 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బెల్‌బాటమ్‌’ వాయిదా పడుతుందా?

ముంబయి: కరోనా తగ్గుముఖం పట్టింది... చిత్రీకరణలు మొదలయ్యాయి...కొన్ని సినిమాలు అయితే రాత్రి పగలు కష్టపడి చిత్రీకరణను పూర్తి చేసేశాయి. ఇక విడుదల చేయడమే ఆలస్యం. కానీ చిక్కంతా ఇక్కడే వస్తుంది. దేశంలో చాలా చోట్ల థియేటర్లు తెరుచుకోలేదు. ఈ నెల చివరి వారం నుంచి థియేటర్లు పూర్తిస్థాయిలో మొదలవుతాయనే అందరూ అనుకున్నారు. కానీ ఆ పరిస్థితిలో అంత వేగం కనిపించడం లేదు. ఎందుకంటే థర్డ్‌ వేవ్‌కు సంబంధించి రోజుకో అంచనా బయటకొస్తుంది. ఈ నేపథ్యంలో థియేటర్లు డైలామాలో పడ్డాయి. ఈ నెల ఆగి తెరిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు పంపిణీదారులు, ప్రదర్శనకారుల్లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అక్షయ్‌కుమార్‌ నటించిన ‘బెల్‌బాటమ్‌’ విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 27న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘ఈ నెల 27నాటికి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో థియేటర్లు తెరిచే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే ‘బెల్‌బాటమ్‌’ ఆగస్టు 13కి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి’’అని ఓ ప్రముఖ పంపిణీదారుడు చెప్పినట్టు సమాచారం. అదే జరిగితే చాలా సినిమాల విడుదల తేదీలు మారే అవకాశం ఉంది. కానీ చిత్రబృందం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. రంజిత్‌ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో వాణీ కపూర్‌ నాయిక. లారా దత్తా, హ్యుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని