సిరాజ్‌పై స్టోక్స్‌ స్లెడ్జింగ్‌: రంగంలోకి కోహ్లీ! - benstokes sledged siraj
close
Updated : 04/03/2021 19:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిరాజ్‌పై స్టోక్స్‌ స్లెడ్జింగ్‌: రంగంలోకి కోహ్లీ!

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌కు నోటి దురుసు ఎక్కువే! ప్రత్యర్థి ఆటగాళ్లను మానసికంగా దెబ్బకొట్టేందుకు అతడు పరుష, అశ్లీల పదజాలం వాడుతుంటాడు. గతంలోనూ ఎన్నోసార్లు చేశాడు. టీమ్‌ఇండియాతో నాలుగో టెస్టులోనూ అతడు తన నోటికి పనిచెప్పాడు. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. సారథి విరాట్‌ కోహ్లీ రంగంలోకి దిగడంతో చల్లబడ్డాడు!

జో రూట్‌ను ఔట్‌ చేశాక బెన్‌స్టోక్స్‌కు సిరాజ్‌ ఓ పదునైనా బౌన్సర్‌ విసిరాడు. ఆ తర్వాత అతడి వంకే తదేకంగా చూశాడు. దానికి స్పందనగా స్టోక్స్‌ దురుసు పదజాలం ఉపయోగించాడు. దాంతో సిరాజ్‌ ఈ విషయాన్ని కోహ్లీకి వివరించడంతో అతడు స్టోక్స్‌కు తగిన రీతిలో సమాధానం చెప్పాడు.

‘బౌలింగ్‌ చేసిది ఆస్ట్రేలియాలోనైనా భారత్‌లోనైనా 100% శ్రమించడం నా నైజం. బాగా బౌలింగ్‌ చేయాలని ప్రతి బంతికీ నాకు నేనే చెప్పుకుంటాను. బెన్‌స్టోక్స్‌ నాపై దురుసుగా మాట్లాడాడు. విషయం విరాట్‌ భాయ్‌కు చెప్పాను. ఆ తర్వాత అతడు చూసుకున్నాడు’ అని సిరాజ్‌ అన్నాడు.

‘పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. ఓపికగా ఆడటమే వ్యూహం. బంతికోసం ఎదురుచూసి ఆడాలి. జట్టులో ఇద్దరే పేసర్లు ఉండటంతో రొటేషన్‌ కీలకమని విరాట్‌ చెప్పాడు. రెండు ఓవర్లు వేశాక ఉదయం ఇషాంత్‌ బదులు బౌలింగ్‌ చేయాలన్నాడు. ఆ ఎండ్‌లో బంతికి మంచి మూమెంట్‌ లభించింది’ అని సిరాజ్‌ తెలిపాడు. మ్యాచులో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 205కు ఆలౌటవ్వగా భారత్‌ 24/1తో నిలిచిన సంగతి తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని