Kiara Advani: న‌టిగా ఏడేళ్ల ప్ర‌యాణం - bharat ane nenu actress kiara advani completed 7 yeasrs as an actor
close
Published : 13/06/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kiara Advani: న‌టిగా ఏడేళ్ల ప్ర‌యాణం

ఇంట‌ర్నెట్ డెస్క్‌: తెలుగులో న‌టించింది రెండు చిత్రాల్లోనే అయినా ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌పై మంచి ప్ర‌భావం చూపింది బాలీవుడ్ న‌టి కియారా అడ్వాణీ. త‌న‌ అందం, అభిన‌యంతో అన‌తికాలంలోనే స్టార్ నాయిక‌గా మారిన కియారా న‌టిగా నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఆమె న‌టించిన తొలి చిత్రం ‘ఫగ్లీ’ (హిందీ). 2014 జూన్ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ సినిమా. దేవి అనే పాత్ర పోషించి తొలి ప‌రిచ‌యంలోనే అంద‌రి మ‌న్న‌న‌లు పొందింది కియారా. ఆ త‌ర్వాత వ‌ర‌స అవ‌కాశాలు అందుకుని బాలీవుడ్‌లో త‌న‌దైన ముద్ర వేసింది. ఎం.ఎస్‌. ధోని, మెషీన్‌, క‌ళంక్‌, క‌బీర్ సింగ్‌, గుడ్ న్యూస్‌, ల‌క్ష్మి, ఇందూ కీ జ‌వానీ త‌దిత‌ర చిత్రాల‌తోపాటు వెబ్ సిరీస్‌ల్లోనూ త‌న ప్ర‌తిభ చాటింది. 2018లో ‘భ‌ర‌త్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మ‌హేశ్ బాబు హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కించిన సినిమా ఇది. రాజ‌కీయ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా ఘ‌న విజయం అందుకోవ‌డంతోపాటు న‌టిగా కియారాకు మంచి గుర్తింపునిచ్చింది. అప్ప‌టి నుంచి వ‌సుమ‌తిగా తెలుగు యువ‌త గుండెల్లో గూడుక‌ట్టుకుంది కియారా. ఆమె న‌టించిన మరో తెలుగు చిత్రం ‘విన‌య విధేయ రామ‌’. రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. ఇందులో సీత అనే పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేసింది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని