COVAXIN తయారీని పెంచుతున్నాం - bharat biotech announces covaxin capacity expansion
close
Updated : 20/04/2021 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

COVAXIN తయారీని పెంచుతున్నాం

భారత్‌ బయోటెక్ ప్రకటన

హైదరాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ఔషధ తయారీ సంస్థలు వ్యాక్సిన్‌ తయారీని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా  ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ తన కొవాగ్జిన్‌ తయారీ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు ప్రకటించింది. ఏడాదికి 70 కోట్లు డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. బెంగుళూరు, హైదరాబాద్‌లలో ఈ మేరకు ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించింది. తయారీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కొవాగ్జిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు అవసరమైన ముడిపదార్థాలు ప్యాకింగ్‌ సామాగ్రి సమకూర్చుకున్నట్లు తెలిపింది.

క్రమక్రమంగా కొవాగ్జిన్ తయారీని పెంచుతున్నామని, వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యం పెంపు ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ బీఎస్ ఎల్ 3 తయారీ యూనిట్లు అందుబాటులో ఉండటం వల్ల తక్కువ సమయంలో ఉత్పత్తి పెంపు సాధ్యపడిందని వివరించింది. టీకా ఉత్పత్తి సామర్థ్యం మరింత పెంచేందుకు వీలుగా వాణిజ్య స్థాయిలో వ్యా్క్సిన్‌ తయారీ అనుభవం ఉన్న ఇండియన్ ఇమ్యూనలాజిక్స్‌తో భాగస్వామ్యం వల్ల సాంకేతిక బదిలీ కార్యక్రమం కొనసాగుతోందని పేర్కొంది. విదేశాల్లో కూడా అనుభవంతో కూడిన తయారీ భాగస్వాముల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. దిగుమతులపై ఆధారపడకుండా వ్యాక్సిన్‌ తయారీలో ఉపయోగించే ఐఎమ్ డీజీ అగోనిస్ట్ మాలిక్యూల్స్‌ను విజయవంతంగా తయారీ చేస్తున్నామని, త్వరలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. వాణిజ్య స్థాయిలో ఈ మాలిక్యూల్స్ ఉత్పత్తి భారత్‌లో ఇదే మొదటి సారని భారత్‌ బయోటెక్‌  వెల్లడించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని