కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతివ్వండి - bharat biotech seeks emergency use approval for covaxin
close
Updated : 08/12/2020 06:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతివ్వండి

భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు 

దిల్లీ: కొవిడ్‌-19 నివారణకు తాము అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాకు అత్యవసర వినియోగ అనుమతినివ్వాలని ఔషధ దిగ్గజం భారత్‌ బయోటెక్‌ కోరింది. ఈ మేరకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసిందని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. కొవాగ్జిన్‌ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) భాగస్వామ్యంతో దేశీయంగా భారత్‌ బయోటెక్‌ రూపొందించింది. ఇప్పటికే ఫైజర్, సీరం సంస్థలు కూడా తమ టీకాలకు అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాయి. ఈ మూడు కంపెనీల విజ్ఞప్తులను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో)లోని నిపుణుల కమిటీ బుధవారం పరిశీలించనుంది. దేశంలో కొద్దివారాల్లోనే కొవిడ్‌-19 టీకా సిద్ధమవుతుందని ఈ నెల 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని