జనవరిలో మళ్లీ మొదలు పెడతారా? - bharateeyudu 2 movie shoot resume in january
close
Published : 12/12/2020 04:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనవరిలో మళ్లీ మొదలు పెడతారా?

చెన్నై: లంచగొండులకు ముచ్చెమటలు పట్టించే దేశభక్తుడిగా కమల్‌  హాసన్‌ నటించిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ఓ సంచలనం. దాదాపు 24 ఏళ్ల తర్వాత హీరో కమల్,    దర్శకుడు శంకర్‌ ఆ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు.  అప్పటినుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. సినిమా షూటింగ్‌ గతేడాది మొదలెట్టారు. దురదృష్టవశాత్తు ఫిబ్రవరిలో చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో అప్పటినుంచే షూటింగ్‌ ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా, లాక్‌డౌన్‌లతో చిత్రీకరణ జరగలేదు. ఇంతలో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని వార్తలు పుట్టుకొచ్చాయి.

అయితే ఇప్పుడు అభిమానులకు ఊరటనిచ్చే ఓ వార్త చెన్నైలో చక్కర్లు కొడుతోంది. భారతీయుడు 2 చిత్రీకరణ పునః ప్రారంభం అవుతుందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది జనవరి చివర్లో  కానీ, ఫిబ్రవరి ఆరంభంలో కానీ కమల్‌ షూటింగ్‌లో పాల్గొంటారని   సమాచారం. నెల రోజుల్లో సినిమా అంతా పూర్తి చేసి ఆ తర్వాత తమిళ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఆయన ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘విక్రమ్‌’ సినిమా పనుల్లోనూ కమల్‌ బిజీగా ఉన్నారు. ఇందులో విలన్‌ పాత్ర కోసం ఫాహద్‌ ఫాజిల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని