మేం స్కీంలు తెస్తే.. వాళ్లు స్కాంలు చేస్తున్నారు - bhatija mamatas nephew and company swindled central money sent for amphan relief amit shah at gosaba rally
close
Published : 23/03/2021 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేం స్కీంలు తెస్తే.. వాళ్లు స్కాంలు చేస్తున్నారు

అమిత్‌ షా

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా గోసబా నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా.. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ పేదల అభివృద్ధి కోసం స్కీంలు పెడుతుంటే.. వారిని దోచుకోవడానికి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్కాంలు చేస్తున్నారని ఆరోపించారు. దీదీ అభివృద్ధిని పక్కన పెట్టి తన మేనల్లుడిని సీఎం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ షా మండిపడ్డారు.

‘పశ్చిమబెంగాల్‌లో ఆంఫన్‌ తుఫాను బాధితుల కోసం కేంద్రం 10వేల కోట్లు మంజూరు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ సహాయాన్ని ఇక్కడి ప్రజలకు అందించలేదు. భాజపా ప్రభుత్వం ఏర్పాటైతే అలాంటి అక్రమాలన్నింటిపై సిట్‌ వేసి దర్యాప్తు చేయిస్తాం. నరేంద్రమోదీ పేదల అభివృద్ధి కోసం 115 పథకాలు ప్రవేశపెడితే.. దీదీ పేదలను దోచుకోవడం కోసం అంతకు మించిన స్కాంలు చేస్తున్నారు’ అంటూ షా తీవ్ర విమర్శలు చేశారు.

‘భాజపా అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యంతో పాటు, వితంతువులకు పెన్షన్‌ రూ.వెయ్యి నుంచి 3వేలకు పెంచుతాం. కోల్‌కతాను దేశ సాంస్కృతిక రాజధానిగా మార్చేందుకు రూ.11వేల కోట్లు కేటాయిస్తాం. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. భాజపా ఎక్కడ ఏ హామీ ఇచ్చినా దాన్ని తప్పక నెరవేర్చుతుంది’ అని షా వెల్లడించారు. బెంగాల్‌ శాసనసభకు మార్చి 27న తొలి దశ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని