పరిచయమైన ఆరో రోజే పెళ్లన్నాడు: మెహరీన్‌ - bhavya proposed to me underwater in the andamans it was magical
close
Updated : 20/03/2021 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరిచయమైన ఆరో రోజే పెళ్లన్నాడు: మెహరీన్‌

భవ్యతో మెహరీన్‌ ప్రయాణమిలా..

హైదరాబాద్‌: ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’లో మహాలక్ష్మిగా మెప్పించి.. ‘ఎఫ్‌-2’లో హనీగా అలరించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్‌. ఇటీవల ఈ నటి నిశ్చితార్థం భవ్య బిష్ణోయ్‌తో వేడుకగా జరిగింది. ఈ నేపథ్యంలో తన లైఫ్‌ పార్ట్నర్‌ గురించి మెహరీన్‌ కొన్ని విషయాలను పంచుకున్నారు. కాబోయే శ్రీవారు పరిచయమై కేవలం పది నెలలే అయినప్పటికీ జీవితకాలం అతనితో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపారు.

‘‘మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. గతేడాది లాక్‌డౌన్‌లోనే మాకు పరిచయం ఏర్పడింది. లాక్‌డౌన్‌ వల్ల మేమిద్దరం కలవలేకపోయాం. కానీ, పరిచయమైన నాటి నుంచి ప్రతిరోజూ మెస్సేజ్‌లు, ఫోన్లు చేసుకునేవాళ్లం. ఇద్దరి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలనూ పంచుకున్నాం. మేమిద్దరం మాట్లాడుకోవడం ప్రారంభించిన ఆరు రోజులకే తను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం గత నెల అండమాన్‌ వెళ్లాం. స్కూబా డైవింగ్‌ చేస్తున్న సమయంలో ‘విల్‌ యూ మ్యారీ మీ’ అనే కార్డుతో భవ్య నన్ను సర్‌ప్రైజ్ చేశాడు. నేను కూడా ఓకే చెప్పాను’’

‘‘నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ప్రతి విషయాన్ని మేమిద్దరమే దగ్గరుండి చూసుకున్నాం. ఎందుకంటే ఇది మా జీవితాల్లో ఎంతో ముఖ్యమైన వేడుక. నిశ్చితార్థం ఎక్కడ జరగాలి? ఎలాంటి ఫుడ్‌ అతిథులకు అందించాలి? బహుమతులు ఎలా ఉండాలి? డెకరేషన్స్‌... ఇలా ప్రతి చిన్న విషయాన్ని మేమిద్దరం ఎంతో ప్లాన్‌ చేసి సిద్ధం చేశాం. పెళ్లి డేట్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదు. వింటర్‌ సీజన్‌లో వివాహం జరిగే అవకాశం ఉంది. మాది పక్కా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌. నేను ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను’’ అని మెహరీన్‌ తెలిపారు. మరోవైపు, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ఎఫ్‌-3’లో నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని