Bhoot Police: ఓటీటీలోకే సైఫ్‌ అలీఖాన్‌ మూవీ - bhoot police on ott
close
Published : 22/05/2021 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bhoot Police: ఓటీటీలోకే సైఫ్‌ అలీఖాన్‌ మూవీ

కరోనా రెండో దశ దెబ్బకు ఇప్పటివరకూ వేచి చూసిన చిత్రాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే ‘రాధే’ లాంటి చిత్రాలు ఓటీటీలో దారిలో నడిచి హిట్టు కొట్టాయి. తాజాగా బాలీవుడ్‌ చిత్రం ‘భూత్‌ పోలీస్‌’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌, అర్జున్‌కపూర్‌, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, యామి గౌతమ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రమిది. పవన్‌ కృపలానీ తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సంబంధించిన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే   అవకాశం ఉంది.


 దినేష్‌ విజన్‌ నిర్మించిన ‘షిద్దత్‌’ చిత్రాన్నీ ఓటీటీలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. రాధికా మదన్‌, దియానా పెంటీ, మోహిత్‌ రైనా, సన్నీ కౌశల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ప్రేమ కథా చిత్రమిది. ఈ రెండింటినీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని