ప్రజలే సైన్యంగా మారి శత్రుదేశాన్ని ఎదుర్కొంటే..! - bhuj the pride of india teaser out ajay devgn
close
Published : 12/07/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రజలే సైన్యంగా మారి శత్రుదేశాన్ని ఎదుర్కొంటే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజలే సైన్యంగా మారి శత్రుదేశాన్ని ఎదుర్కోవడం ఎప్పుడైనా చూశారా..? ఇలాంటి యదార్థ సంఘటన ఆధారంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌దేవ్‌గణ్‌, సోనాక్షి సిన్హా జంటగా ‘భుజ్‌ (ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా)’. 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. అప్పట్లో భుజ్ విమానాశ్రయానికి ఇన్‌ఛార్జిగా ఉన్న ఐఏఎఫ్‌ స్క్వాడ్రన్ నాయకుడు విజయ్ కార్నిక్ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఆదివారం పంచుకున్నారు. సోమవారం ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. 

ఈ చిత్రం ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఆగస్టు 13నుంచి అందుబాటులోకి రానుంది. పీరియాడిక్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ అభిషేక్‌ దుహానియా తెరకెక్కించారు. సంజయ్‌దత్‌, శరద్‌ కేల్కర్‌, ప్రణితాసుభాష్‌, నోరా ఫతేహీ కీలకపాత్రలు పోషించారు. అర్కో సంగీతం అందించారు. టీ సిరీస్‌, అజయ్‌దేవ్‌గన్‌ ఎఫ్‌ఫిల్మ్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ పతాకాలపై భుషణ్‌కుమార్‌ తదితరులు నిర్మించారు. 

ఈ చిత్రం ద్వారా అజయ్‌దేవ్‌గన్‌ తొలిసారిగా ఒక స్క్వాడ్రన్‌ కనిపించనున్నాడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘భుజ్‌.. నిజ జీవిత పాత్రల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో నేను స్క్వాడ్రన్ పాత్ర పోషిస్తున్నాను. ఇదో భారీ చిత్రం. భారత సైన్యం సమయానికి చేరుకోలేనప్పుడు కొంతమంది ప్రజలు పాకిస్థాన్‌ సైన్యాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేదాని చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది’’ అని అజయ్‌ చెప్పుకొచ్చాడు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని