కరోనా బారిన భూమి, విక్కీ - bhumi and vickey tested covid positive
close
Published : 05/04/2021 18:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా బారిన భూమి, విక్కీ

ముంబయి: బాలీవుడ్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆలియాభట్‌, రణ్‌బీర్‌కపూర్‌, అమీర్‌ఖాన్‌, పరేష్‌ రావల్‌, కార్తిక్‌ ఆర్యన్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌, అక్షయ్‌ కుమార్ తదితర తారలు కొవిడ్‌-19 బారిన పడ్డ విషయం తెలిసిందే.  తాజాగా యువ నటులు భూమి పెడ్నేకర్‌, విక్కీ కౌశల్‌ ఆ జాబితాలో చేరారు. తమకు కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు.

‘నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. స్వీయ నిర్బంధంలో ఉన్నాను. వైద్యుల సూచనలు పాటిస్తున్నాను. ఈ మధ్యకాలంలో నన్ను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్ని తేలికగా తీసుకోవద్దు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించండి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోండి. భౌతిక దూరం పాటించండి’ అని భూమి సూచించారు. విక్కీ కౌశల్‌ సైతం ఇదే విషయాన్ని తెలియజేశారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని