టీకా ఉత్పత్తి పెంచాలి: బైడెన్‌ - biden hopes america to be back to normal by this time next year
close
Updated : 03/03/2021 15:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా ఉత్పత్తి పెంచాలి: బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికాలో కొవిడ్‌-19 టీకాల ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యక్షుడు జో బైడెన్‌ పలు సూచనలు చేశారు. అదేవిధంగా దేశంలో పౌరులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ మేరకు బైడెన్‌ మంగళవారం శ్వేత సౌధం వద్ద విలేకరులతో మాట్లాడారు. 

‘దేశంలో ఆమోదించిన మూడు వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. వీలైనంత ఎక్కువ మంది టీకా‌ తీసుకోవడం ద్వారా మనం వైరస్‌ను తొందరగా నివారించవచ్చు. తద్వారా మన ఆర్థిక వ్యవస్థను పూర్వ స్థితికి తెచ్చుకోగలం. అన్నింటికంటే ముఖ్యంగా చిన్నారులను పాఠశాలలకు పంపడం అత్యవసరం. వ్యాక్సినేషన్‌ పూర్తయితేనే అది సాధ్యం. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి వంద రోజుల్లో వంద మిలియన్‌ వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో సగం లక్ష్యాన్ని 37 రోజుల్లోనే అధిగమించాం. అదేవిధంగా మిగిలిన లక్ష్యాన్ని అనుకున్న విధంగా పూర్తిచేస్తాం’ అని నమ్మకంతో ఉన్నట్లు బైడెన్‌ చెప్పారు. అయితే అమెరికాలో ఈ విపత్కర పరిస్థితులు తొలగిపోయి.. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి వచ్చే ఏడాది వరకు సమయం పట్టవచ్చని బైడెన్‌ అభిప్రాయపడ్డారు. కానీ, అది ప్రజలు అర్థం చేసుకుని నడుచుకునే విధానంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

‘ టీకా కేంద్రాలను పెంచుతున్నాం. అంతేకాకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సులభతరం చేసేందుకు దేశవ్యాప్తంగా ఏడు వేల ఫార్మసీలకు మిలియన్ల సంఖ్యలో టీకాలను పంపిణీ చేశాం. స్టేడియంలు, సామాజిక కేంద్రాలు, పార్కింగ్‌ ప్రదేశాలు సహా పలు ప్రాంతాల్లో టీకాలు అందజేసేందుకు ప్రభుత్వం రాష్ట్రాలతో కలసి పనిచేస్తోంది. ఇటీవల హ్యూస్టన్‌లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలను నేను నా భార్య జిల్‌తో కలిసి సందర్శించాను’ అని బైడెన్‌ వెల్లడించారు.  

కాగా, యూఎస్‌లో ఇప్పటివరకు మూడు వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆ దేశంలో మహమ్మారికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5.11లక్షలు దాటడం గమనార్హం. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని