Bigg Boss 5: రవి డైలాగ్స్‌కు చికాకొచ్చింది.. నేను డబ్బుల కోసం రాలేదు.. - bigg boss day 52 in the house
close
Updated : 28/10/2021 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss 5: రవి డైలాగ్స్‌కు చికాకొచ్చింది.. నేను డబ్బుల కోసం రాలేదు..

ఇంటర్నెట్‌డెస్క్‌: బిగ్‌బాస్‌(BIGG Boss 5)లో కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ కొనసాగింది. టాస్క్‌ సందర్భంగా హౌస్‌ లాక్‌డౌన్‌లో ఉండటంతో గెలిచిన సభ్యులు మినహా మిగిలిన వారందరూ గార్డెన్‌ ఏరియాలో కింద చాపలేసుకుని పడుకున్నారు. ‘ఈ చాపలేంటో.. కింద పడుకోవడం ఏంటో.. నిజంగా నువ్వు కఠినాత్ముడువి బిగ్‌బాస్‌’ అంటూ కెప్టెన్‌ సన్నీ(sunny) అంటే, ‘ఏ పరిస్థితుల్లోనైనా బతకాలనే ఈ టాస్క్‌ ఇచ్చారు’ అంటూ కాజల్‌(kajal) చెప్పుకొచ్చింది.

నేను అన్‌ఫిట్‌: జెస్సీ

నాలుగో ఛాలెంజ్‌లో భాగంగా పాల్గొనే విషయమై ఇంటి సభ్యుల మధ్య చర్చ జరిగింది. తొలుత ఆడనన్న జెస్సీ(jaswanth) మళ్లీ ఆడతానని చెప్పడంతో ఎవరు పక్కకు తప్పుకుంటారన్న దానిపై చర్చ జరిగింది. చివరకు అనీ మాస్టర్‌, కెప్టెన్సీ సన్నీలు తాము తప్పుకొంటామని చెప్పారు. అయితే, తనకోసం ఎవరూ తప్పుకోవద్దని, తను అన్‌ఫిట్‌ అంటూ జెస్సీనే తప్పుకొన్నాడు. ‘ఈ కారణం చెప్పి, అతడికి వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ ఇవ్వొద్దు’ అంటూ సిరి(siri), షణ్ముఖ్‌(shanmukh)లు హౌస్‌మేట్స్‌ను కోరారు. ‘జెస్సీ తనకోసం మాట్లాడటం లేదని, అతని తరపున మాట్లాడితే మనం విలన్లు అవుతున్నాం’ అని షణ్ముఖ్‌-సిరి మాట్లాడుకున్నారు.

రంగు పడుద్ది ఆడిన ప్రియాంక, అనీ మాస్టర్‌

‘అభయహస్తం’ కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా నాలుగో ఛాలెంజ్‌ ‘రంగు పడుద్ది’ ఇచ్చాడు. ఈ ఛాలెంజ్‌లో కాన్వాస్‌పై ఎవరి రంగు ఎక్కువగా ఉంటుందో వాళ్లు గెలిచినట్లు అని బిగ్‌బాస్‌(Bigg boss) చెప్పాడు. ఇందులో ప్రియాంక(Priyanka)పై అనీ మాస్టర్‌(anee master) విజయం సాధించింది. ఇక బెడ్‌ రూమ్‌లో సిరి-షణ్ముఖ్‌ మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ‘మనిద్దరం కలిసి ఓ సాంగ్‌ చేద్దాం’ అని సిరి అంటే, ‘హమీదా(Hamida) కూడా ఇంతే.. వర్క్‌ అనేసరికి నేను గుర్తొస్తాను. బయటకు వెళ్లి వీడియోలు చేద్దాం అనేసరికి నేను గుర్తొస్తాను’ అని చిరాకు పడ్డాడు. దీంతో సిరికి కోపం వచ్చింది. ‘నీతో సాంగ్‌ చేయడానికే నేనిదంతా చేస్తున్నానా?’ అని అలిగింది. వెంటనే షణ్ముఖ్‌ సారీ చెప్పాడు. ‘ఎవడికి కావాలిరా నీ సారీ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసి.. నాకు ఒళ్లు మండిపోతుంది’ అని ఫైర్‌ అయింది. డైనింగ్‌ ఏరియాలో భోజనం చేస్తున్న శ్రీరామ్‌ ఏమైందా? అని ఆశ్చర్యంగా చూశాడు.

నేను డబ్బుల కోసం రాలేదు: రవి

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఐదో ఛాలెంజ్‌ ‘కారులో హుషారుగా’ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో కాజల్‌, సన్నీ పాల్గొనగా, సన్నీ విజయం సాధించాడు. ఈ క్రమంలో రవి, సిరి, షణ్ముఖ్‌ల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘షన్ను అతిగా ఆలోచిస్తున్నాడు కదా’ అని రవి(Ravi) అనగా ‘అన్ని వైపుల నుంచి ఆలోచిస్తున్నాడు’ అని సిరి చెప్పుకొచ్చింది. తాను డబ్బుల కోసం బిగ్‌బాగ్‌కు రాలేదని, తన భార్య నిత్య, కూతురు వియా ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉందని రవి అన్నాడు. అంతేకాకుండా తనకు పెద్ద వాళ్లైన తల్లిదండ్రులు ఉన్నారని, వాళ్లను చూసుకోవాల్సిన అవసరం కూడా ఉందని వాపోయాడు. వాళ్లు ఎలా ఉన్నారో చెప్పాలని, లేదా తననైనా బయటకు పంపాలని రవి కోరాడు. మరోపక్క మానస్‌, కాజల్, జెస్సీ మాట్లాడుకుంటూ రవి గేమ్‌ తనదైన శైలిలో ఆడతాడని అనుకున్నారు. ఈ వారం ఎవరి వికెట్‌ డౌన్‌ చేయాలా? అని ఆడతాడని మాట్లాడుకున్నారు. సీక్రెట్‌ రూమ్‌లో రవి గురించి లోబో చెప్పిన తర్వాత ‘ఈ వికెట్‌ డౌన్‌’ అతడు అనుకుని ఉంటాడని చెప్పుకొన్నారు.

ఆఖరి ఛాన్స్‌లో మానస్‌ అదరగొట్టాడు

కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో విజయం సాధించలేని వారికి ‘బంతిలో ఉంది భాగ్యం’ అనే స్పెషల్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. బజర్‌ మోగినప్పుడు సర్కిల్‌లో ఉన్న బంతి పట్టుకున్న ప్రతిసారి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ నుంచి ఒకరిని ఎలిమినేట్‌ చేయవచ్చు. ఈ గేమ్‌లో వరుసగా బంతి సాధించిన మానస్‌(Manas).. విశ్వ, రవి, జెస్సీ, లోబో, కాజల్‌, పింకీలను ఎలిమినేట్‌ చేసి కెప్టెన్సీ కంటెండర్‌ అయ్యాడు. ఫైనల్‌గా ఈ వారం కెప్టెన్సీ కోసం షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, అనీ, సన్నీ, మానస్‌ పోటీపడుతున్నట్లు బిగ్‌బాస్‌(Bigg boss) ప్రకటించాడు తెలిపాడు. అంతేకాకుండా బిగ్‌బాస్‌ హౌస్‌లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో ఇంటి సభ్యులందరూ ఊపిరి పీల్చుకున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని