Bigg Boss Telugu 5: తెలియకుండా వాగుతుంటా.. అన్నీ నాకు వినపడతాయి! - bigg boss telugu 5 sunday episode promo
close
Updated : 17/10/2021 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: తెలియకుండా వాగుతుంటా.. అన్నీ నాకు వినపడతాయి!

హైదరాబాద్‌: శనివారం హాట్‌ హాట్‌గా, సీరియస్‌గా సాగిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ సండే సందడిగా సాగింది. ‘సండే ఫన్‌డే’ అంటూ నాగార్జున హౌస్‌మేట్స్‌తో చిన్న చిన్న టాస్క్‌లు చేయించారు. అంతేకాకుండా పాటలకు డ్యాన్స్‌లు కూడా వేయించారు. ఇక తొలిసారి ఆదివారం ఒక టాస్క్‌లో విజయం సాధించానంటూ షణ్ముఖ్‌ ఆనందపడిపోయాడు. ‘సిరి ఏదో అన్నావు. నేను విన్నాను. అన్నీ వినపడతాయి మాకు’ అని నాగార్జున అనగా, ‘అదే తెలియక అప్పుడప్పుడు నేనేదో వాగుతుంటా’ అని రవి అని సరికి ‘ఇప్పుడు తెలుసుకున్నావా రవి’ అంటూ నాగార్జున నవ్వులు పంచారు. ఇక సీక్రెట్‌ గదిలో ఉన్న లోబో అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. తాను ఇచ్చిన డ్రెస్‌ ఎందుకు వేసుకోలేదంటూ నాగార్జున ప్రశ్నించేసరికి లోబో తెల్లముఖం వేశాడు. ఆదివారం హౌస్‌మేట్స్‌తో కలిసి నాగార్జున చేసిన సందడి ఏంటి? నామినేషన్స్‌లో ఉన్న 10మందిలో ఎవరు సేవ్‌ అయ్యారు? ఎవరు ఎలిమినేట్‌ అయ్యారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే?



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని