Bigg Boss Telugu5: నామినేషన్స్‌ ప్రియపై లహరి.. రవి ఫైర్‌ - bigg boss telugu5 third week nominations stared
close
Updated : 20/09/2021 20:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu5: నామినేషన్స్‌ ప్రియపై లహరి.. రవి ఫైర్‌

హైదరాబాద్‌: తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌5’లో మూడోవారం నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్‌ల మధ్య వాడీవేడీ వాదన జరిగింది. హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని, తమకు ఇష్టం లేని పోటీదారుల పేర్లను బోర్డుపై ముద్రించి అందుకు తగిన కారణాలు చెప్పి పేరు రాసిన బోర్డును సుత్తితో బద్దలు కొట్టాల్సిందిగా బిగ్‌బాస్‌ సూచించారు.

దీంతో హౌస్‌మేట్స్‌ మరోసారి విశ్వరూపం చూపించారు. మాటల యుద్ధానికి దిగారు. కొందరు స్వీట్‌ వార్నింగ్‌లు ఇస్తే, ఇంకొందరు ఘాటు వార్నింగ్‌లు ఇచ్చారు. ఈ క్రమంలో ‘నీకూ-నాకు-మానస్‌’కు ఇంత నెగిటివిటీ అవసరం లేదని శ్రీరామచంద్ర అంటే, ‘ప్రియ’ అన్న మాటను తాను జీర్ణించుకోలేకపోతున్నానని, అందుకే నామినేట్‌ చేస్తున్నట్లు సన్నీ తెలిపాడు. నామినేట్‌ చేసేందుకు ‘పనికిమాలిన కారణాలు చెబుతారు’ అని ప్రియాంక కాస్త అసహనం వ్యక్తం చేసింది. ‘ఇంకెంత కాలం చిన్న చెడ్డీలు వేసుకుని, దెబ్బ చూపిస్తావంటూ’ జస్వంత్‌కు చురకలు అంటించాడు రవి. అంతేకాదు, ఒక్కొక్కరూ సుత్తి తీసుకుని తమ ఇష్టంలేని హౌస్‌మేట్స్‌ బోర్డులను బద్దలు కొట్టారు. మరి ఈ వారం ఎవరెవరు నామినేషన్స్‌లో ఉన్నారు? ఎవరి మధ్య వాడీవేడీ చర్చ జరిగింది? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే!





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని