Bigg Boss Telugu 5: ప్రియ షాకింగ్ కామెంట్స్.. లహరి, రవి ఫైర్.. తేలని నామినేషన్స్.. - biggboss latest nomination
close
Updated : 21/09/2021 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: ప్రియ షాకింగ్ కామెంట్స్.. లహరి, రవి ఫైర్.. తేలని నామినేషన్స్..

ఇంటర్నెట్‌డెస్క్‌: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. నాగార్జున వ్యాఖ్యాతగా ప్రస్తుతం ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ ప్రసారమవుతోంది. తాజాగా మూడోవారానికి సంబంధించి నామినేషన్స్‌ ప్రక్రియ సోమవారం అసంపూర్తిగా ముగిసింది. ప్రియ చేసిన వ్యాఖ్యల కారణంగా హౌస్‌లో యుద్ధ వాతావరణమే నెలకొంది. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా హౌస్‌మేట్స్‌కు నచ్చని ఇద్దరి పేర్లను టైల్స్‌పై ముద్రించి.. సుత్తితో పగలకొట్టాల్సిందిగా బిగ్‌బాస్‌ సూచించాడు. ఈ క్రమంలో శ్రీరామచంద్ర నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభించాడు.

ఒక్కో హౌస్‌మేట్‌.. హౌస్‌లో కొనసాగే అర్హత లేని వాళ్ల పేర్లను టైల్స్‌పై ముద్రిస్తూ పగల కొట్టడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొందరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరగ్గా.. మరికొందరు చెప్పిన కారణాలు సిల్లీగా అనిపించాయి. లహరి నామినేషన్‌ మొదలు పెట్టగానే ప్రియ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ప్రియని నామినేట్‌ చేసిన లహరి.. ‘మీరు నాతో ఎక్కువసేపు సమయం కేటాయించలేదు. నాకు ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. అందుకే నామినేట్‌ చేస్తున్నా’ అని చెప్పింది. దీంతో ప్రియ.. ‘‘ఎందుకంటే మీరు హౌస్‌లో ఉన్న ‘మెన్స్‌’తో ఎక్కువసేపు గడుపుతుండటంతో నాతో మాట్లాడే సమయం దొరకడం లేదు’’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది. వీరిద్దరి సంభాషణలోకి రవిని లాగడంతో ఆగ్రహానికి గురైన ఆయన తీవ్రంగా స్పందించారు.

‘రెస్ట్‌రూమ్‌ వద్ద రవిని లహరి హగ్‌ చేసుకోవడం చూశాను. అందుకే ఆమె ఎక్కువ సేపు మెన్స్‌తో గడుపుతున్నారని చెప్పాను’ అని ప్రియ.. లహరితో అనడంతో అది కాస్త చినికి చినికి గాలివానలా అయ్యింది. సిరి, కాజల్‌లను ఏవిధంగా సోదరిభావంతో చూస్తానో అదేవిధంగా లహరిని చూస్తానని.. అది కేవలం ఆప్యాయతతో ఇచ్చిన హగ్‌ మాత్రమేనని.. దయచేసి అందులో బూతు వెతకవద్దని ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఇచ్చేముందు ముందూ వెనుక ఆలోచించుకోవాలని ప్రియపై రవి విరుచుకుపడ్డాడు. లహరి కూడా తీవ్రంగానే స్పందించింది. రవిని సోదరుడిగా భావించి.. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక తెల్లరంగు షర్ట్‌ పంపించాల్సిందిగా తన కుటుంబసభ్యులను బిగ్‌బాస్‌ కెమెరా ముందు కోరానని ఈ సందర్భంగా లహరి చెప్పారు. తాను చూసింది మాత్రమే చెప్పానని.. ఇలా చెప్పడంలో తనకేమీ భయం లేదని అనడంతో.. మిగిలిన హౌస్‌మేట్స్ కూడా ప్రియపట్ల ఒకింత అసహనానికి గురయ్యారు. ఈ మొత్తం వ్యవహారంతో హౌస్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. నామినేషన్‌ ప్రక్రియ కొద్దిసేపు నిలిచిపోయింది. ఆ తర్వాత, ‘తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి’ అంటూ ప్రియ హౌస్‌మేట్స్‌ అందర్నీ రిక్వెస్ట్‌ చేశారు.

నామినేషన్‌ ప్రక్రియ తిరిగి ప్రారంభం కాగానే ప్రియ.. సన్నీని నామినేట్‌ చేయగా.. పరస్పరం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఒక మహిళై ఉండి మరో మహిళ పట్ల.. అది కూడా పెళ్లికాని యువతి పట్ల అలా మాట్లాడడం సరికాదని సన్నీ చెప్పగా.. ‘ఆ వ్యవహారంతో నీకు సంబంధం లేదంటూ’ ప్రియ ఘాటుగా స్పందించింది. దీంతో సమయం ముగిసిపోవడంతో నామినేషన్‌ ప్రక్రియ మరోరోజు కూడా కొనసాగనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని