అక్కడ ప్రైవేటులోనూ ఉచితంగానే టీకా! - bihar to get free vaccine covid shots
close
Published : 01/03/2021 21:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్కడ ప్రైవేటులోనూ ఉచితంగానే టీకా!

పట్నా: దేశవ్యాప్తంగా రెండో విడతలో భాగంగా 60ఏళ్లు వయసు పైబడిన వారికి కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రైవేటులోనూ కొవిడ్‌ టీకా పంపిణీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, ప్రభుత్వం కొవిడ్‌ టీకాలను ఉచితంగా అందిస్తున్నప్పటికీ, ప్రైవేటులో మాత్రం డబ్బులు చెల్లించి టీకా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రైవేటులోనూ ఉచితంగానే టీకా పంపిణీ చేస్తామని బిహార్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా కొవిడ్‌ టీకా అందిస్తుండగా, ప్రైవేటు కేంద్రాల్లో మాత్రం టీకా ధరను రూ.250గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ టీకాను ఉచితంగానే అందిస్తామని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ స్పష్టంచేశారు. ప్రైవేటులో ఇచ్చే టీకాల ఖర్చును కూడా రాష్ట్రమే భరిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉచిత టీకా పంపిణీ చేయాలని బిహార్‌ కేబినెట్‌ గత డిసెంబరులోనే ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

దేశంలో కొవిడ్‌ టీకా పంపిణీ రెండో విడతలో భాగంగా, నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో పాటు మరికొంతమంది ప్రముఖులు తొలి డోసు తీసుకున్నారు. టీకాలపై ప్రజల్లో నెలకొన్న భయాలు, అనుమానాలను తొలగించేందుకే టీకా తీసుకుంటున్నట్లు ప్రముఖులు వెల్లడించారు. తొలి డోసు తీసుకున్న వీరందరూ 28రోజుల అనంతరం రెండో డోసు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 43లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో కోటి 18లక్షల మందికి తొలి డోసు ఇవ్వగా, మరో 24లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని