Corona: బాలీవుడ్‌ నటుడు కన్నుమూత - bikramjeet kanwarpal dies due to covid19
close
Published : 01/05/2021 22:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: బాలీవుడ్‌ నటుడు కన్నుమూత

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ రంగాన్ని కరోనా కుదిపేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి తాజాగా మరో నటుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రముఖ నటుడు, మాజీ ఆర్మీ అధికారి విక్రమ్‌జీత్‌ కన్వర్‌పాల్‌ (52) కరోనాకు బలయ్యారు. ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన ముంబయిలోని సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. రిటైర్డ్‌ ఆర్మీ అధికారి అయిన విక్రమ్‌జీత్‌ ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రలు పోషించారు. పలు టీవీ ధారావాహికల్లోనూ నటించిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ.. గతంలో ఆయన సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టులు చేశారు. కాగా.. ఆయన మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని