పవన్‌ను కలిసిన భాజపా అభ్యర్థి రత్నప్రభ - bjp candidate ratnaprabha meets janasena chief pawan kalyan
close
Updated : 27/03/2021 09:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ను కలిసిన భాజపా అభ్యర్థి రత్నప్రభ

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక భాజపా అభ్యర్థి రత్నప్రభ కలిశారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఆమె పవన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్ దేవ్‌ధర్‌, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని