అసోం ఎన్నికలు.. భాజపా మేనిఫెస్టో విడుదల! - bjp national president jp nadda releases party manifesto for assam elections
close
Published : 23/03/2021 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అసోం ఎన్నికలు.. భాజపా మేనిఫెస్టో విడుదల!

గువహటి: అసోం శాసనసభ ఎన్నికలకు అధికార భాజపా మేనిఫెస్టో ప్రకటించింది. గువహటిలో మంగళవారం ‘సంకల్ప్‌ పాత్ర’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నడ్డాతో పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం సర్బానంద సోనోవాల్‌ నాయకుల నేతృత్వంలో అసోం అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. భాజపా మేనిఫెస్టోలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కూడిన అంశాలను పొందుపరిచింది. 

మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన హామీలు
బ్రహ్మపుత్ర నది నీటిని నిల్వ చేసుకుని వినియోగించుకునేందుకు నదిపై పలు రిజర్వాయర్లు నిర్మాణం.
అర్హులైన 30లక్షల కుటుంబాలకు అరుణోదయ పథకం కింద నెలకు రూ.3వేల ఆర్థిక సాయం.
ప్రభుత్వ రంగంలో రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి. 2022 మార్చి 31లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ. అంతేకాకుండా ప్రైవేటు రంగంలో 8లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి.
అసోం భద్రత కోసం సవరణలతో కూడిన ఎన్‌ఆర్‌సీపై పనిచేసి.. అక్రమ చొరబాటుదార్లను కనుగొనడం ద్వారా నిజమైన భారతీయ పౌరులకు రక్షణ.
మిషన్‌ శిశు ఉన్నయన్‌ పథకం కింద బాలలకు నాణ్యమైన విద్య. ఎనిమిదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ. 
భారతీయ పౌరులందరికీ భూ హక్కులు కల్పించడంతో పాటు విద్య, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్యం, మహిళా సాధికారతకు పలు కార్యక్రమాలు చేపడతామని పేర్కొంది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని