Donations: 75%+ విరాళాలు భాజపాకే..! - bjp received rs 276.45 cr from electoral trusts in 2019-20
close
Published : 23/06/2021 18:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Donations: 75%+ విరాళాలు భాజపాకే..!

దిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి విరాళాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. 2019-20 ఏడాదికి గానూ ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా ఆ పార్టీకి రూ.276.45 కోట్లు విరాళాలు వచ్చాయి. అన్ని పార్టీలకు వచ్చిన విరాళాలతో పోలిస్తే ఒక్క  భాజపాకే 76.17 శాతం విరాళాలు రావడం గమనార్హం. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి రూ.58 కోట్లు (15.98శాతం) వచ్చినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) నివేదిక వెల్లడించింది.

పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన జాబితాలో జేఎస్‌డబ్ల్యూ, అపోలో టైర్స్‌, ఇండియా బుల్స్‌, దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, డీఎల్‌ఎఫ్‌ గ్రూప్స్‌ ఉన్నాయి. ఒక్క జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ అత్యధికంగా రూ.39.10 కోట్లు విరాళంగా ఇచ్చింది. అపోలో టైర్స్‌ రూ.30 కోట్లు, ఇండియా బుల్స్‌ రూ.25 కోట్లు సమకూర్చాయి. భాజపా, కాంగ్రెస్‌ కాకుండా మరో 12 పార్టీలకు ఎలక్ట్రోరల్‌ ట్రస్టుల ద్వారా రూ.25.46 కోట్లు అందాయి. ఈ జాబితాలో ఆప్‌, ఎస్‌హెచ్‌ఎస్‌, ఎస్సీ, యువ జన్‌ జాగృతి పార్టీ, జననాయక్‌ పార్టీ, జేడీయూ, జేఎంఎం, ఎల్జేపీ, ఎస్‌ఏడీ, ఐఎన్‌ఎల్డీ, జేకేఎన్‌సీ, ఆర్‌ఎల్డీ ఉన్నాయని ఏడీఆర్‌ పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఏడు ఎలక్ట్రోరల్‌ ట్రస్టులు ఈసీకి సమర్పించిన విరాళాల ఆధారంగా ఈ వివరాలను ఏడీఆర్‌ వెల్లడించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని