బెంగాల్‌లో 148 మందితో భాజపా జాబితా - bjp releases list of 148 candidates for bengal polls
close
Published : 18/03/2021 19:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగాల్‌లో 148 మందితో భాజపా జాబితా

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ మరో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 5, 6 7, 8 విడతల్లో పోటీ చేయబోయే 148 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ గురువారం విడుదల చేశారు. ఈ జాబితాలో పార్టీ ఉపాధ్యక్షుడు ముకుల్‌రాయ్‌, రాహుల్‌ సిన్హా, అసిమ్‌ సర్కార్‌ పేర్లు ఉన్నాయి. గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన ముకల్‌ రాయ్‌ ఈ ఎన్నికల్లో కృష్ణా నగర్‌ ఉత్తర్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 

ఇప్పటికే తొలి నాలుగు విడతల ఎన్నికలకు అభ్యర్థులను భాజపా ప్రకటించింది. తాజాగా మిగిలిన విడతలకు పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 8 దశల్లో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు జరగనున్నాయి. మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని