భాజపా నేతల వల్లే బెంగాల్‌లో కరోనా ఉద్ధృతి - bjp responsible for covid surge in bengal
close
Published : 16/04/2021 17:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపా నేతల వల్లే బెంగాల్‌లో కరోనా ఉద్ధృతి

మమతా బెనర్జీ ధ్వజం

నబద్వీప్‌: ఎన్నికల ప్రచారం కోసం భాజపా బయటి వ్యక్తులను రాష్ట్రానికి తీసుకురావడం వల్లే పశ్చిమ్‌బెంగాల్‌లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల వ్యక్తులు బెంగాల్‌కు రాకుండా నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. 

నదియా జిల్లాలో నేడు ఎన్నికల ప్రచారం చేపట్టిన దీదీ.. భాజపా నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ప్రధాని, ఇతర భాజపా నేతలు రాష్ట్రంలో ప్రచారానికి వస్తే మేం ఏమీ అనుకోం. కానీ వారి ర్యాలీల్లో పోడియం, వేదికలు సిద్ధం చేయడానికి భాజపా బయటి రాష్ట్రాలకు చెందిన ప్రజలను ఎందుకు తీసుకొస్తోంది? స్థానిక కూలీలను, డెకరేటర్లను ఉపయోగించుకోవచ్చు కదా! కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి వ్యక్తులను తీసుకురావడం వల్లే బెంగాల్‌లో కొవిడ్‌ విజృంభిస్తోంది. దీనిపై నేను ఈసీ వద్దకు వెళ్తాను. బయటి వ్యక్తులు రాష్ట్రానికి రాకుండా చూడాలని కోరతాను’’ అని మమత అన్నారు. 

ఎన్నికల ప్రచారం చేయకుండా తనను అడ్డుకునేందుకే భాజపా తనపై దాడి చేయించిందని దీదీ మరోసారి దుయ్యబట్టారు. అయితే ప్రజల ఆశీర్వాదబలంతోనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడ్డానని అన్నారు. తన కాలి గాయం దాదాపు తగ్గిపోయిందని తెలిపారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని