దీదీ కంటే ముందున్నాం: అమిత్‌షా - bjp with 122 seats is way ahead of mamata says amith shah
close
Published : 19/04/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీదీ కంటే ముందున్నాం: అమిత్‌షా

కోల్‌కతా:  పశ్చిమ్‌బెంగాల్‌ ఎన్నికల్లో భాజపా చరిత్ర సృష్టించడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు. 122 సీట్లతో అధికార తృణమూల్‌ కంటే ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బాంబులు, గన్‌ల సంస్కృతిని.. విశ్వాసం, అభివృద్ధి దిశగా అడుగులు వేసేలా చేస్తామని వాగ్దానం చేశారు. ‘‘ ప్రస్తుత ఎన్నికల్లో  భాజపా 122 స్థానాలు సాధించడం ఖాయం. అంతేకాకుండా తృణమూల్‌ కాంగ్రెస్‌ కంటే ముందుంటాం’’ అని పుర్బ బర్దమాన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా అన్నారు.

పశ్చిమ్‌బెంగాల్‌లో 8 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 5 దశలు పూర్తవ్వగా మరో మూడు విడతల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్‌, భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇరుపార్టీలు పోటాపోటీగా సభలు, బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నాయి.  మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. పోలింగ్‌ తేదీకి మూడు రోజుల ముందుగానే ప్రచారం నిలిపి వేయాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌షోలను నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు సైతం వెనకాడబోమని ఈసీ స్పష్టం చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని