viral video: బీఎంసీ మార్షల్‌ను బానెట్‌పై ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్‌ - bmc marshal clings on to moving cars bonnet to collect fine video goes viral
close
Published : 07/09/2021 23:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

viral video: బీఎంసీ మార్షల్‌ను బానెట్‌పై ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్‌

ముంబయి: కరోనా నిబంధనలు ఉల్లంఘించడంతో జరిమానా వసూలు చేయబోయన బీఎంసీ మార్షల్‌ను ఓ కారు డ్రైవర్‌ బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారివద్ద జరిమానాలు వసూలు చేసేలా ముంబయి పురపాలక శాఖ బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) మార్షల్స్‌ను నియమించింది. సురేశ్‌ పవార్‌(36) అనే మార్షల్‌ శాంతాక్రూజ్‌లోని భుగ్రా సిగ్నల్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఓ క్యాబ్‌లో కూర్చున్న మహిళ మాస్కు ధరించకపోవడంతో రూ.200 జరిమానా కట్టాలని సురేశ్‌ ఆమెను కోరారు. ఇందుకు ఆ మహిళ అంగీకరించింది.

కానీ.. అంతలోనే కారును స్టార్ట్‌ చేసిన డ్రైవర్‌ ఆగకుండా ముందుకు సాగాడు. మార్షల్‌ సూచించినా వినలేదు. దీంతో కారును ఆపాలంటూ సురేశ్‌ బ్యానెట్‌పై దూకాడు. అయినా కారును ఆపని డ్రైవర్‌.. అతడిని ఈడ్చుకుంటూ కొంతదూరం అలాగే వెళ్లిపోయాడు. మరింత వేగం పెంచడంతో బ్యానెట్‌పై నుంచి సురేశ్‌ పక్కకు దూకగా.. డ్రైవర్‌ దూసుకెళ్లిపోయాడు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగానే క్యాబ్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని