అమితాబ్ ‘ప్రతీక్ష’ బంగ్లా గోడ పడగొట్టనున్న బీఎంసీ - bmc to demolish part of amitabh bachchans bungalow pratiksha to widen the road
close
Published : 06/07/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమితాబ్ ‘ప్రతీక్ష’ బంగ్లా గోడ పడగొట్టనున్న బీఎంసీ

ముంబయి: బాలీవుడ్‌ నటుడు, బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ బంగ్లా ‘ప్రతీక్ష’కు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. ముంబయికి విచ్చేసే ఆయన అభిమానులు ప్రతీక్ష గేటు ఎదురుగా ఫొటోలు దిగుతుంటారు. అంతేకాదు.. అమితాబ్‌ తల్లితండ్రులు హరివంశ్‌ బచ్చన్‌, తేజీ బచ్చన్‌ ఇందులోనే నివసించే వారట.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న బంగ్లా గోడను కూల్చివేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపించింది బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ (బీఎంసీ). ట్రాఫిక్‌ రద్దీ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రతీక్ష బంగ్లా గోడ కూల్చివేయాలని బీఎంసీ నిర్ణయించింది. తద్వారా రోడ్డు విస్తరణ జరిగి ట్రాఫిక్‌ సమస్య తీరనుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటీసులను బీఎంసీ అధికారులు అమితాబ్‌కు నాలుగేళ్ల క్రితమే పంపించారని, అదే ప్రాంతంలో బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీకి సైతం స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. గతంలోనే ప్రతీక్షకు దగ్గరలో ఉండే గోడ కూల్చగా, బిగ్‌బి బంగ్లాని మాత్రం కూల్చకుండా వదిలేశారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే తనయుడు, పర్యాటక, పర్యావరణశాఖ మంత్రి ఆదిత్యఠాక్రే ట్రాఫిక్‌ రద్దీ కారణంగా రోడ్ల విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారని, ఇందులో భాగంగానే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని