తన బయోపిక్‌ గురించి ప్రియాంక ఏమందంటే? - bollywood actress priyanka chopra about her biopic
close
Published : 20/07/2021 10:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తన బయోపిక్‌ గురించి ప్రియాంక ఏమందంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో అగ్రకథానాయికగా కొనసాగుతూనే హాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడా సత్తా చాటుతోంది ప్రియాంక చోప్రా. నిక్‌ జొనాస్‌తో పెళ్లయ్యాకా అంతర్జాతీయంగా మరింత పాపులర్‌ అయ్యింది. పలు అంతర్జాతీయ వేదికలపై గౌరవాలు, సత్కారాలు అందుకుంటోంది. తమిళ చిత్రం ‘తమిజాన్‌’తో నాయికగా కెరీర్‌ మొదలుపెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ బాలీవుడ్‌లో స్టార్‌ కథానాయికగా ఎదిగింది. జాతీయస్థాయి ఉత్తమ కథా నాయికగా పురస్కారం అందుకుంది. నటిగా ఉన్నతస్థాయికి ఎదిగినా ఇంకా తను చేయల్సింది చాలా ఉంది అంటోంది ప్రియాంక. తన బయోపిక్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తే...‘‘దయచేసి నా బయోపిక్‌ తీయొద్దు. ఎందుకంటే నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకా ఆ దశకు చేరుకోలేదు’’అని చెబుతోంది ప్రియాంక. ‘మాట్రిక్స్‌’, ‘టెక్ట్స్‌ ఫర్‌ యు’తో పాటు పలు హాలీవుడ్‌ చిత్రాలు ఆమె చేతిలోఉన్నాయి.

కిక్‌ ఇచ్చే ఖరీదైన కానుక

సినిమా జంటల్లో ప్రియాంక చోప్రా, నిక్‌ జొనాస్‌లు బాగా పాపులర్‌ అనే విషయం తెలిసిందే. ఎక్కడికెళ్లినా ముచ్చటగా మురిపిస్తుందీ జంట. ఇటీవల ప్రియాంక పుట్టిన రోజు జరిగింది. కానీ ఈసారి ప్రియాంకతో నిక్‌ లేడు. ఆయన అమెరికాలో ఉంటే ఆమె లండన్‌లో ఉంది. దీంతో ప్రియాంకకు ఓ కానుకను పంపించాడు నిక్‌. ఖరీదైన వైన్‌ బాటిల్‌ను నిక్‌ తనకు పుట్టినరోజు బహుమతిగా పంపించాడంటూ ఆ బాటిల్‌ ఫొటోను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది ప్రియాంక.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని