చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల్లో బాలీవుడ్‌ భామ? - bollywood beauty in chiru balakrishna films
close
Published : 21/03/2021 18:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల్లో బాలీవుడ్‌ భామ?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ కొత్త చిత్రాల్లో బాలీవుడ్‌ భామ నటిస్తోందా? అవకాశాలున్నాయని అంటున్నాయి సినీ వర్గాలు. ఆయా చిత్ర బృందాలు ఇప్పటికే ఆమెను సంప్రదించాయని సమాచారం. ఇంతకీ ఆమె ఎవరంటే? ‘దబాంగ్‌’ బ్యూటీ సోనాక్షి సిన్హా. యువ దర్శకుడు బాబీతో చిరంజీవి ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో నాయికగా సోనాక్షి అయితే బావుంటుందని భావించిన దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించినట్టు తెలుగు, హిందీ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరోవైపు బాలకృష్ణ- గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలోనూ ఈ భామనే నాయికగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. ఈ మేరకు సోనాక్షితో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించేందుకు ఆమె సుముఖంగానే ఉందని టాక్‌. త్వరలోనే స్పష్టత రావచ్చు.

ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ భామలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ కలయికలో తెరకెక్కనున్న చిత్రంతో అగ్ర కథానాయిక దీపికా పదుకొణె, పూరి జగన్నాథ్‌- విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘లైగర్‌’ సినిమాతో యువ నాయిక అనన్య పాండే త్వరలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. మరి ఈ జాబితాలో సోనాక్షి నిలుస్తుందా, లేదా అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని