సుశాంత్‌.. నిన్ను మరవలేకున్నాం - bollywood celebrities remembres shushanthsingh on his birth anniversary
close
Published : 22/01/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌.. నిన్ను మరవలేకున్నాం

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ జయంతి. ఈ వాక్యం వినడానికి అదోలా ఉంది కదా. బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ ఆత్మహత్య చేసుకొని ఏడునెలలు దాటినా.. ఆ చేదునిజాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. 1986లో బిహార్‌లోని పట్నాలో పుట్టిన సుశాంత్‌ ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమారంగంలో స్టార్‌డమ్‌ సంపాదించారు. ధోనీ బయోపిక్‌లో అద్భుతంగా నటించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ముంబయిలో 2020 జూన్‌ 14న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాగా.. నేడు ఆయన జయంతి సందర్భంగా బాలీవుడ్‌ ప్రముఖులు సుశాంత్‌తో తమకున్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు.

‘ప్రియమైన సుశాంత్.. సినీ మాఫియా నిన్ను నిషేధించింది.. వేధించింది. సోషల్ మీడియాలో చాలాసార్లు సహాయం కోసం ఎదురుచూశావు. ఆ సమయంలో నీకోసం అక్కడ లేకపోయినందుకు చింతిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన సుశాంత్’      - కంగన

‘సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం మేం ఇలా సంతోషంగా గడిపాం. కానీ.. ఈ రోజు అవన్నీ జ్ఞాపకంగా మిగిలిపోయాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు సుశాంత్. మిస్‌ యూ’     - ప్రీతిజింటా

‘ఈరోజు ఇలా నిన్ను గుర్తు తెచ్చుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే సుష్. నువ్వు ఎక్కడ ఉన్నా నవ్వుతూ, శాంతితో ఉంటావని నేను ఆశిస్తున్నాను’     - కృతీసనన్‌

ఇదీ చదవండి..

సుశాంత్‌ సోదరి ఉదారత..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని