Ramayan: న‌టుడు చంద్ర‌శేఖ‌ర్ కన్నుమూత - bollywood famous actor chandra sekhar passed awy
close
Updated : 16/06/2021 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ramayan: న‌టుడు చంద్ర‌శేఖ‌ర్ కన్నుమూత

ముంబ‌యి: ‘రామాయ‌ణ్’ ధారావాహిక‌తో న‌టుడిగా మంచి గుర్తింపు పొందిన చంద్ర శేఖ‌ర్ (98) మ‌ర‌ణించారు. ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన శేఖ‌ర్‌ వ‌యోభారంతో స్వ‌గృహంలోనే బుధ‌వారం ఉద‌యం తుది శ్వాస విడిచారు. ‘‘నాన్న‌గారు నిద్ర‌లోనే క‌న్నుమూశారు. ఆయ‌నికి ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేవు. వ‌య‌సు మీద ప‌డ‌టంతోనే చ‌నిపోయారు’’ అని చంద్ర శేఖ‌ర్ కుమారుడు, నిర్మాత అశోక్ శేఖ‌ర్ అన్నారు. జుహులోని ప‌వ‌న్ హాన్స్‌లో ఈ రోజు సాయంత్రం ఆయన అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

1923లో హైద‌రాబాద్‌లో పుట్టిన చంద్ర‌శేఖ‌ర్ న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో 1950లో జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆ త‌ర్వాత ‘సురంగ్’ అనే చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ‘క‌వి’, ‘మ‌స్తానా’, ‘బ‌సంత్ బ‌హార్‌’, ‘కాలీ టోపీ లాల్ రుమాల్’, ‘గేట్ ఆఫ్ ఇండియా’, ‘ఫ్యాష‌న్‌’, ‘ధ‌ర్మ‌’, ‘డ్యాన్స్ డ్యాన్స్‌’, ‘ల‌వ్ ల‌వ్ ల‌వ్’ త‌దిత‌ర సినిమాల్లో విభిన్న పాత్ర‌లు పోషించి మెప్పించారు. 250కిపైగా చిత్రాల్లో చంద్ర‌శేఖ‌ర్ క‌నిపించారు. 1964లో స్వీయ నిర్మాణంలో ‘ఛ ఛ ఛ’ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 1966లో ‘స్ట్రీట్ సింగ‌ర్’ అనే  సినిమాని తెర‌కెక్కించారు. 70ల్లో ‘ప‌రిచ‌య్‌’, ‘కౌశిష్’, ‘ఖుష్బూ’, ‘మౌస‌మ్’ త‌దిత‌ర సినిమాలకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గానూ ప‌నిచేశారు. రామానంద్ సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘రామాయ‌ణ్ సీరియ‌ల్‌తో (డీడీ ఛాన‌ల్‌) విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారాయ‌న‌. ఇందులో ఆర్య సుమంత్ అనే పాత్ర పోషించారు. చంద్ర‌శేఖ‌ర్‌కి ముగ్గురు కుమారులు ఉన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని