Samantha: సమంతకు క్వీన్‌ ప్రశంస - bollywood queen kangana praises samantha
close
Published : 20/05/2021 22:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samantha: సమంతకు క్వీన్‌ ప్రశంస

హైదరాబాద్‌: తన నటనతో ఎంతోమంది తెలుగువారి హృదయాలను కొల్లగొట్టి దక్షిణాదిలో అగ్రకథానాయికగా రాణిస్తున్నారు నటి సమంత అక్కినేని. ప్రస్తుతం ఉత్తరాదిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆమె సిద్ధమయ్యారు. ఆమె కీలకపాత్రలో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మేన్‌-2’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘ది ఫ్యామిలీ మేన్‌-2’ సిరీస్‌ ట్రైలర్‌ను టీమ్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో సమంత పెర్ఫామెన్స్‌ చూసి దక్షిణాది, ఉత్తరాది తారలు ఫిదా అయ్యారు. ఉగ్రవాదిగా ఆమె నటన అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. కాగా, తాజాగా బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ సైతం సామ్‌ని మెచ్చుకున్నారు. ‘నటనతో సమంత నా హృదయాన్ని దోచేసింది’ అని కంగన పోస్ట్‌ పెట్టారు. అంతేకాకుండా టీమ్‌ మొత్తానికి అభినందనలు తెలిపారు. సదరు పోస్ట్‌పై స్పందించిన సామ్‌.. క్వీన్‌కి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సామ్‌ని రానా ప్రశంసించారు. ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని.. ఫుల్‌ సిరీస్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు.

కొంతకాలం క్రితం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకాదరణ మెండుగా పొందిన సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మేన్‌’. రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్‌.. ఓటీటీలో సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి జంటగా నటించిన ఈ సిరీస్‌కు స్వీకెల్‌గా ‘ది ఫ్యామిలీ మేన్‌ -2’ రూపొందించారు. ఇందులో సామ్‌ రాజీ అనే పాత్రలో కనిపించనున్నారు. జూన్‌ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని