ధనుష్‌, విజయకాంత్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు - bomb threats to dhanush and vijayakanths houses
close
Published : 14/10/2020 12:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధనుష్‌, విజయకాంత్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు

పోలీసుల సోదాలు..

చెన్నై: తమిళ కథానాయకులు విజయకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కు రెండు సార్లు ఫోన్‌ చేశారు. చెన్నైలోని అభిరామపురంలో గల ధనుష్‌ ఇంటిలో, విరుగంబక్కంలోని విజయకాంత్‌ ఇంట్లో బాంబులు పెట్టారని సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన పోలీసులు వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. తమకు వచ్చిన సమాచారంలో నిజం లేదని తేల్చారు. ప్రాథమిక విచారణలో రెండుసార్లు ఫోన్‌ చేసిన వ్యక్తి ఒక్కరేనని గుర్తించినట్లు తెలిసింది. తప్పుడు సమాచారం ఇచ్చి, అసౌకర్యం కలిగించినందుకు ఆ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు.

కొన్ని నెలలుగా కోలీవుడ్‌లో ఇలాంటి బెదిరింపుల ఫోన్‌కాల్స్‌ ఎక్కువైపోయాయి. రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌, సూర్య ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఓ మానసిక  వికలాంగుడు ఈ ఫోన్‌ కాల్స్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. జులై 18న ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి అజిత్‌ ఇంట్లో బాంబు ఉందని హెచ్చరించాడు. పోలీసులు ఆయన నివాసానికి చేరుకుని సోదాలు చేసి, అది తప్పుడు సమాచారమని నిర్ధారించుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని