రోగ నిరోధక శక్తిని పెంచుకోండిలా..! - boos your immunity…| sukhibhava |
close
Published : 26/05/2021 23:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోగ నిరోధక శక్తిని పెంచుకోండిలా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే మాస్క్‌ ధరించడం, శుభ్రత, భౌతిక దూరం పాటించడం ఇవొక్కటే చాలదు. వీటితో పాటు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవాలి. రోగనిరోధక శక్తి పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. వ్యాధి నిరోధక శక్తి వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. ఈ తరుణంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు చూద్దాం..

మహమ్మారి కరోనాపై విజయం సాధించాలంటే కరోనా నిబంధనలను పాటించాలి. అలాగే ఇమ్యునిటీని పెంచుకోవడం ప్రయత్నించాలి. దీనికోసం పండ్లూ కూరగాయాలను ఎక్కువగా తీసుకోవాలి. చిరు ధాన్యాలనూ ఎండుఫలాలు తీసుకోవడం మరీ మేలు. పుల్లగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్‌ సి అందుతుంది. విటమిన్‌ సి సమృద్ధిగా లభిస్తే వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నిమ్మ, బత్తాయి, దానిమ్మ, కమల, నారింజ వంటి పండ్లు ఎక్కువగా తీసుకుంటే విటమిన్‌ సి లభిస్తుంది. అల్లం, వెల్లుల్లి, బొప్పాయి, గ్రీన్‌ టీ వంటి వాటికి మన శరీరంలో రోగ నిరోధక శక్తని పెంచే గుణం ఉంది. వీటిని తరచుగా తీసుకోవాలి. మాంసాహారం విషయానికి వస్తే చేపలను తినడం మేలు. బొచ్చెలు, శీలావతులు వంటి తెల్లరకం చేపల్ని, పీతల్ని తినవచ్చు. పీతలు తినడం శరీరానికి కావలసిన జింక్‌ అందుతుంది. దాంతో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవడానికి ఆహారపు అలవాట్లతో పాటు రోజూ కాసేపు వ్యాయామం చేయాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండాలి. కరోనాను కట్టడి చేయడానికే కాదు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచడానికి వ్యక్తిగతంగా, సామాజికంగా పరిశుభ్రతను పాటించాలి. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి. అప్పడే మహమ్మారి కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని