Kohli-Rohit: ఎవరిని ఔట్‌ చేయడం తేలికంటే - bowling to rohit sharma comparatively easy says mohammad amir
close
Published : 21/05/2021 18:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kohli-Rohit: ఎవరిని ఔట్‌ చేయడం తేలికంటే

ఇంటర్నెట్‌ డెస్క్‌: విరాట్‌ కోహ్లీతో పోలిస్తే రోహిత్‌ శర్మకు బౌలింగ్‌ చేయడం తేలికని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ అన్నాడు. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేసి అతడిని పెవిలియన్‌కు పంపించొచ్చని తెలిపాడు. ఒత్తిడిలో అత్యుత్తమంగా ఆడతాడు కాబట్టి విరాట్‌ను ఔట్‌ చేయడం కాస్త కష్టమని వెల్లడించాడు. కానీ వీరిద్దరికీ బౌలింగ్‌ చేయడం తనకు సులువేనని అభిప్రాయపడ్డాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు ఆమిర్‌ వీడ్కోలు పలికాడు. జట్టు యాజమాన్యం, సెలక్టర్లు, బోర్డు తనను మానసికంగా వేధిస్తున్నారని అతడు గతంలో ఆరోపించాడు. ప్రస్తుతం తన భార్య, పిల్లలతో కలిసి లండన్‌లో ఉంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌ క్రికెట్‌ టోర్నీలు ఆడాలని అతడు భావిస్తున్నట్టు సమాచారం. చివరి ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో అతడు భారత టాప్‌ ఆర్డర్‌ను కుదేలు చేయడం అందరికీ తెలిసిందే.

‘వారిద్దరికీ బౌలింగ్‌ చేయడం కష్టమేం కాదు. నిజానికి రోహిత్‌ శర్మకు బౌలింగ్‌ చేయడం తేలిక. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేస్తూ అతడిని ఔట్‌ చేయగలను. ఎడమచేతి వాటం పేసర్‌ విసరే ఇన్‌స్వింగర్లకు అతడు ఇబ్బంది పడతాడు. ముందుగానే బ్యాటు నుంచి దూరంగా వెళ్లే బంతులూ ఆడలేడు. ఒత్తిడిలో రాణిస్తాడు కాబట్టి విరాట్‌ను ఔట్‌ చేయడం కాస్త కష్టమని చెప్పొచ్చు. అయితే విరాట్‌, రోహిత్‌కు బౌలింగ్ చేయడం నాకైతే కఠినంగా అనిపించదు’ అని ఆమిర్‌ అన్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని