వచ్చే వేసవిలో ‘బుల్లెట్‌ ట్రైన్‌’ - brad pitt bullet train sets april 2022 theatrical release date
close
Published : 17/06/2021 10:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వచ్చే వేసవిలో ‘బుల్లెట్‌ ట్రైన్‌’

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పటికే ఒకటిన్నర ఏడాదిగా  విడుదలలు లేక, చిత్రీకరణలు వాయిదా పడి... ఇబ్బంది పడుతున్న ప్రపంచ సినీ పరిశ్రమ  ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. హాలీవుడ్‌లోనూ చిత్రీకరణలు మొదలవుతున్నాయి. విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్‌ కథానాయకుడు బ్రాడ్‌పిట్‌ నటిస్తున్న ‘బుల్లెట్‌ ట్రైన్‌’ చిత్రాన్ని 2022, ఏప్రిల్‌ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జపాన్‌లో ఒకరిని హత్య చేయడానికి నియమించిన అయిదుమంది హంతకులు బుల్లెట్‌ ట్రైన్‌లో కలుసుకుంటారు. తామంతా ఒకే పని మీద ఆ ట్రైన్‌లోకి వచ్చినట్లు తెలుసుకుంటారు. తర్వాత ఏం జరిగిందనేది? మిగతా కథా. జో కింగ్, ఆండ్రీ కోజి, బ్రెయిన్‌ హెన్రీ, మిచ్చెల్‌ షనాన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రాడ్‌పిట్‌ మాట్లాడుతూ ‘‘చాలా సంతోషంగా ఉంది. ‘వన్స్‌ అపాన్‌ ఏ టైం ఇన్‌ హాలీవుడ్‌’ తర్వాత ప్రేక్షకులను అలరించడానికి మేం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’’ అని పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని