‘బ్రహ్మాస్త్ర’: నాగార్జున పూర్తి చేశారు!  - brahmastra shooting completed
close
Updated : 16/02/2021 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బ్రహ్మాస్త్ర’: నాగార్జున పూర్తి చేశారు! 

ముంబయి: బాలీవుడ్‌లో సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్‌, నాగార్జున, రణబీర్‌ కపూర్‌, అలియాభట్‌ వంటి స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. బిగ్ ఇండియన్‌ మూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో తాను కనిపించే సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని నాగార్జున ట్విటర్‌లో తెలియజేశారు.

రణబీర్‌, ఆలియా, ఆయాన్‌తో కలిసున్న ఫొటోను పంచుకున్న నాగ్‌.. ‘‘బ్రహ్మాస్త్ర’లో నా షూటింగ్‌ పూర్తయ్యింది. రణబీర్‌, ఆలియా లాంటి ప్రతిభావంతులతో పనిచేయడం ఒక గొప్ప అనుభూతినిచ్చింది. అయాన్‌ ముఖర్జీ సృష్టించిన ‘బ్రహ్మాస్త్ర’లోకాన్ని చూసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నాను’’ అంటూ రాసుకొచ్చారు. వాస్తవానికి ఈ సినిమా గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా సినిమా చిత్రీకరణ పూర్తికాలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని