ఆ దేశంలో ఒకే రోజు 1,641 మంది మృతి - brazil record for covid deaths as hospitals near collapse
close
Published : 03/03/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ దేశంలో ఒకే రోజు 1,641 మంది మృతి

బ్రెసిలియా: బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ తీవ్రత మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. అక్కడ తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాలు గతేడాది మార్చి నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1,641 మంది మృతి చెందటమే అందుకు నిదర్శనం. దీంతో దేశంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రమైనట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇటీవల జరిగిన పలు వేడుకలే ఇందుకు కారణంగా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దేశంలోని 20 రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో 80శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు దేశంలో కర్ఫ్యూ విధించాలని జాతీయ ఆరోగ్య కార్యదర్శులు పిలుపునిచ్చారు. 

బ్రెజిల్‌లో కొవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2.57లక్షల మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న దేశం బ్రెజిలే కావడం గమనార్హం. మరోవైపు బ్రెజిల్‌ జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ ఏడాది చివరికల్లా అందరికీ టీకా అందించాలని ప్రభుత్వం యత్నిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని