ఈ క్రికెట్ అందాలు చూశారా? - breathtakingly beautiful cricket stadium in balochistan icc shares pictures
close
Published : 03/02/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ క్రికెట్ అందాలు చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్: ఐసీసీ ఓ అందమైన క్రికెట్ స్డేడియాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకుంది. దీని కంటే గొప్ప ప్రకృతి సోయగం ఉన్న క్రికెట్ స్టేడియాల్ని చూపిస్తారా అని అభిమానులని అడిగింది. పర్వతాల మధ్యలో పచ్చికతో మెరుస్తున్న సుందరమైన ఆ స్టేడియాన్ని చూసి ఎవరైనా మంత్రముగ్దులవ్వాల్సిందే. ఇంతకీ ఆ స్టేడియం ఏదంటారా? బలూచిస్థాన్‌లోని గ్వాదర్‌ క్రికెట్ స్టేడియం.

ఐసీసీతో పాటు పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా క్రికెటర్లు కూడా ఆ స్టేడియాన్ని కొనియాడుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ షంసి.. ‘మూడో టీ20 గ్వాదర్‌లో ఏర్పాటు చేస్తారా? నా దృష్టిలో ధర్మశాల (భారత్‌), న్యూలాండ్స్‌ (దక్షిణాఫ్రికా), గ్వాదర్ అందమైన క్రికెట్‌ స్టేడియాలు’ అని ట్వీటాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పాక్‌తో దక్షిణాఫ్రికా రెండు టెస్టుల సిరీస్‌, మూడు టీ20లు ఆడనుంది. తొలి టెస్టులో పాక్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇవీ చదవండి

తండ్రైన ఆనందంలో మరో స్టార్‌ క్రికెటర్‌

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరిన కివీస్‌


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని